Yuvraj Singh's decision to do fitness training at the National Cricket Academy at the expense of Ranji Trophy matches has not gone down well feels, BCCI officials.
టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రంజీ టోర్నీకి డుమ్మాకొట్టి యువరాజ్ సింగ్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడంపై బీసీసీఐ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నాలుగు నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న యువరాజీ ఈ ఏడాది పెద్దగా రంజీ మ్యాచ్‌లు ఆడింది లేదు.ఈ రంజీ సీజన్‌లో పంజాబ్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదానిలోనే మాత్రమే ఆడాడు. విదర్భతో జరిగిన ఆ మ్యాచ్‌లో యువరాజ్ 20, 42 పరుగులు చేశాడు. మిగతా మ్యాచ్‌లకు యువీ దూరంగా ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి యువరాజ్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కనిపించడంతో బీసీసీఐ అధికారులు కంగుతిన్నారు. నిజానికి గాయంతో ఉన్న ఆటగాళ్లు కోలుకునేందుకు ఎన్‌సీఏకు వస్తుంటారు. ఎలాంటి గాయాలు లేకపోయినా ఎన్‌సీఏలో యువరాజ్ ఫిట్‌నెస్ శిక్షణలో పాల్గొంటుండడాన్ని బోర్డు సీనియర్ అధికారి ఒకరు ప్రశ్నించారు.